Evening Snacks: చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికీ ఇష్టమైనవి. స్నాక్స్ (snacks) ఇవి ఇష్టం లేని వారు ఉండరు కానీ మనం రుచికి అలవాటుపడుతూ ఆరోగ్యం గురించి మర్చిపోతున్నాం. ఈ జంక్ ఫుడ్ వలన మన ఆరోగ్యకరమైన శరీరాన్ని అనారోగ్యంగా మార్చుకుంటునాము, కాబట్టి జంక్ ఫుడ్ తినడం మానేయలి. ముఖ్యంగా పిల్లలకు ఈ జంక్ ఫుడ్ వలన అనారోగ్యం బారిన పడుతున్నారు..
ఈ జంక్ ఫుడ్ లో కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది మరియు ఫైబర్ తక్కువగా ఉంటుంది. పోషకాలు అనేవి ఉండవు అందువలన పిల్లలకు ఆరోగ్యకరమైన వంటలను వండి ఇవ్వాలి. అలాంటి వంటకమే ఈ ప్రోటీన్ మిక్స్డ్ దాల్ స్నాక్(Evening Snacks). ఇందులో హై ప్రోటీన్ హై ఫైబర్ తక్కువ ఫ్యాట్ అనేది ఉంటుంది.
ఈ స్నాక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్దాలు:
1 పొట్టుతీయని మినపగుళ్ళు సగం కప్పు
2 పొట్టుతీయని పెసరపప్పు సగం కప్పు
3 పెరుగు సగం కప్పు
4 కొబ్బరి తురుము సగం కప్పు
5 శెనగ పప్పు సగం కప్పు
6 క్యారెట్ తురుము సగం కప్పు
7 క్యాబేజీ సగం కప్పు
8 పచ్చి మిర్చి ఐదు
9 పుదీనా పావు కప్పు
10 అల్లం ఒక స్పూన్
11 నిమ్మ రసం ఒక స్పూన్
12 మీగడ ఒక స్పూన్
13 జీలకర్ర ఒక స్పూన్
14 వములు ఒకస్పూన్
15 వంట సోడా సగం స్పూన్
16 కరివేపాకు కొద్దిగా.
తయారీ విధానం:
ఒక మిక్సీ తీసుకొని అందులో పొట్టుతీయని మినపగుళ్ళు, పెసరపప్పు , శెనగ పప్పు , పచ్చి మిర్చి, అల్లం, కొబ్బరి వేసి మిక్సీ ని ఒక సారి తిప్పాలి. ఆ తరవాత పెరుగు వేసి ఇంకొక సారి తిప్పాలి. తరవాత మిగిలిన పదార్దాలు అన్నీ వేసి ఈ మిక్సర్ లాగా చేసుకోవాలి. ఈ మిక్సర్ ని ఒక గిన్నెలో బాగా కలుపుకోవాలి ఆ తరువాత మనకు కావాల్సిన షేప్ లో స్నాక్స్ ను తయారు చేసుకోవచ్చు.. ఈ విధంగా మనం ఆరోగ్యకరమైన స్నాక్స్(Evening Snacks) ని తినవచ్చు, మనమే ఆరోగ్యానికి మేలు చేసే వంటలను వండుకొని ఆరోగ్యంగా ఉండవచ్చు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb