ఇటీవలి కాలంలో చిన్న వయసు నుంచి వృద్ధుల వరకు నరాల బలహీనత, కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు, మంటలు, నరాల నొప్పులు, నీరసం వంటి సమస్యలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్, పోషకాహార లోపం, మద్యం సేవనం, ధూమపానం, వెన్నెముక సమస్యలు, విటమిన్లు మరియు ఖనిజాల కొరత వంటి అనేక కారణాల వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయని వారు పేర్కొన్నారు.
జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి. ఆదిత్య రంగనాథ్ మాట్లాడుతూ, నరాల ఆరోగ్యానికి వంటింట్లోనే లభించే నువ్వులు, మునగాకు, నెయ్యి వంటి ఆహార పదార్థాలు ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. రోజూ తెల్ల నువ్వులను ఆహారంలో చేర్చడం, మునగాకు పొడి లేదా మునగాకు పప్పు తీసుకోవడం ద్వారా నరాలకు బలం చేకూరుతుందని చెప్పారు.
నరాల బలహీనత, మోకాల నొప్పులు, రెస్పిరేటరీ సమస్యలకు సహజ పరిష్కారాలు.
తిమ్మిర్లు, మంటలు తగ్గించేందుకు గోరువెచ్చని ఉప్పునీరు మరియు చల్లని నీటిలో కాళ్లు లేదా చేతులను మారుస్తూ ముంచే విధానం ఉపశమనం కలిగిస్తుందని సూచించారు. అలాగే నువ్వుల నూనెతో మసాజ్ చేయడం, లవంగాలతో తయారుచేసిన నూనెను నొప్పి ఉన్న ప్రాంతాల్లో రాయడం కూడా ప్రయోజనకరమని వివరించారు.
ఆయుర్వేద నిపుణుడు చిటుబొట్ల మధుసూదన్ శర్మ మాట్లాడుతూ, వాము, లవంగాలు, దాల్చిన చెక్క పొడులను సమపాళ్లలో కలిపి ప్రతిరోజూ గోరువెచ్చని పాలతో తీసుకోవడం వల్ల నరాలకు శక్తి చేకూరుతుందని చెప్పారు. అయితే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాతోనే చికిత్స కొనసాగించాలని సూచించారు.
ఉద్యోగం వదిలేశాక ….స్వేచ్ఛ 11 నిమిషాల తర్వాత మాయమైంది.
మరోవైపు వృద్ధాప్యంలో కనిపించే ఎముకల బలహీనత, కాల్షియం లోపం సమస్యలపై నిపుణులు ప్రత్యేకంగా హెచ్చరించారు. కాల్షియం లోపం వల్ల ఎముకలు పెళుసుగా మారడం, వెన్నెముక వంగిపోవడం, కాళ్లు చేతులు పట్టేయడం, దంత సమస్యలు, ఎత్తు పెరుగుదలపై ప్రభావం వంటి సమస్యలు ఎదురవుతాయని తెలిపారు.
నువ్వులు, రాగులు, ఆకుకూరలు, పాలు, చేపలు, సోయా ఉత్పత్తులు వంటి సహజ ఆహారాలను తీసుకోవడం ద్వారా కాల్షియం లోపాన్ని చాలా వరకు నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, సరైన నీటి వినియోగం, క్రమబద్ధమైన జీవనశైలి ద్వారా నరాలు మరియు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు పేర్కొన్నారు.
రోజూ ఖాళీ కడుపుతో నెయ్యి తింటే ఏమవుతుంది?