Lemon: నిమ్మకాయ అంటే నాచురోపతి. నాకు నిమ్మకాయ లేకుండా నాచురోపతి సాధ్యమే కాదు. అలాంటి నిమ్మకాయను ప్రకృతి మనకు అందజేసింది. అలాంటి నిమ్మకాయ గురించి తెలుసుకుందాం. నిమ్మకాయతో షర్బత్ చేసుకుంటే ఎండాకాలం చాలా మంచిది.100 గ్రాముల నిమ్మకాయ తీసుకుంటే అందులో 92 శాతం నీరే ఉంటుంది. విటమిన్ సి ఎక్కువ ఉంటుంది.
నిమ్మకాయలో కార్బోహైడ్రేట్స్ ,మాంసకృతులు ఏమాత్రం ఉండవు. 100 గ్రాముల నిమ్మకాయ తీసుకుంటే 30 గ్రాముల శక్తి వస్తుంది. నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ యాసిడ్ వల్ల సౌందర్య సాధన మరియు స్కిన్ ఎలర్జీలు దూరం అవుతాయి. 100 గ్రాములు నిమ్మకాయలు, సిట్రిక్ యాసిడ్ 3500 మిల్లీగ్రాములు ఉంటుంది. ఈ సిట్రిక్ యాసిడ్ వల్ల ముఖంలో ఉన్న మచ్చలు తొలగిపోతాయి. అలాగే ముఖం స్మూత్ గా అవుతుంది.
దీంట్లో ఉన్న రెండు పదార్థాలు హెస్పరడిన్ మరియు డేస్ స్పెరిన్ అనే కెమికల్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి అని ఒక రీసెర్చ్ 40 మంది పై పరిశోధన చేసి చెప్పారు. ఇందులో ఉన్న విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది, అలాగే ఇమ్యుని సిస్టం నీ, నిమ్మకాయలో ఉన్న విటమిన్ సి ఆక్టివేట్ చేస్తుంది.
అలాగే దీంట్లో ఉన్న సిట్రిక్ యాసిడ్ కిడ్నీస్ లో స్టోన్స్ రాకుండా కూడా నివారిస్తుంది. నిమ్మకాయలో ఉన్న ఇంకొక మంచి గుణం ఏమిటంటే. డి లెమన్ అనే ఒక కాంపౌండ్ క్యాన్సర్ కణజాలను చంపేస్తుంది. దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా పెద్దగా ఉండదు. ఇంకా చాలా రకాల అద్భుతాలు నిమ్మకాయలో ఉన్నాయి.