మధుమేహం ఉన్నవారిలో వైట్ రైస్ తీసుకోవడంపై అనేక సందేహాలు ఉంటాయి. వైట్ రైస్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, పరిమిత మోతాదులో సరైన ఆహార కలయికతో తీసుకుంటే షుగర్‌ను నియంత్రణలో ఉంచవచ్చని సూచిస్తున్నారు.
అన్నంతో పాటు పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం వల్ల చక్కెర శోషణ నెమ్మదిగా జరుగుతుంది. అలాగే రోజుకు ఒక్కపూట మాత్రమే పరిమితంగా వైట్ రైస్ తీసుకోవడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. వీలైతే కొర్రలు, సామలు, జొన్నలు, రాగులు వంటి తృణధాన్యాలను ప్రత్యామ్నాయంగా ఉపయోగించాలని సూచిస్తున్నారు.
షుగర్ నియంత్రణకు మెంతులకు ప్రత్యామ్నాయం కసూరి మేతి: ఆయుర్వేద నిపుణుడు మధుసూదన్ శర్మ
పండ్ల విషయంలో కూడా అపోహలు అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. జామ, బొప్పాయి, కర్బూజ, కివి, డ్రాగన్ ఫ్రూట్ వంటి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన పండ్లను పరిమితంగా తీసుకోవచ్చు. అయితే మామిడి, అరటి, సపోటా, సీతాఫలం, పనస, ద్రాక్ష వంటి పండ్లను మితంగా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
అదేవిధంగా బాదం, అక్రోట్, పిస్తా, సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ వంటి డ్రై ఫ్రూట్స్, నట్స్ శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు అందిస్తాయని నిపుణులు వెల్లడించారు. సరైన ఆహారం, నియమిత వ్యాయామం, జీవనశైలి మార్పులతో మధుమేహాన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చని వారు స్పష్టం చేస్తున్నారు.
రాజకీయ రంగ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చిన రాఘవ లారెన్స్.. జూన్ 11న కీలక ప్రకటన.

