హెయిర్ డైలకు బదులుగా హెన్నా.. తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చే చిట్కాలు.

హెయిర్ డైలకు బదులుగా హెన్నా.. తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చే చిట్కాలు.

చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో చాలామంది హెయిర్ డైలను ఉపయోగిస్తున్నప్పటికీ, వాటివల్ల స్కాల్ప్ అలర్జీలు, చర్మ సమస్యలు, తలనొప్పి వంటి దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సహజమైన హెన్నా (గోరింటాకు) మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని చెబుతున్నారు.

డయాబెటిస్ ఉన్నవారు వైట్ రైస్ తినొచ్చా? నిపుణులు చెబుతున్న ముఖ్య సూచనలు

నాణ్యమైన హెన్నాను ఎంపిక చేసుకోవడం అత్యంత ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. గోరువెచ్చని నీటితో ఇనుప పాత్రలో హెన్నాను కలిపి కొన్ని గంటలు నానబెట్టి ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని తెలిపారు. తెల్ల జుట్టుకు సహజమైన బర్గండీ రంగు రావాలంటే హెన్నాలో బీట్‌రూట్ జ్యూస్ కలిపి అప్లై చేయాలని సూచిస్తున్నారు. అనంతరం ఇండిగో పౌడర్ ఉపయోగించడం ద్వారా మరింత సహజమైన నలుపు రంగు పొందవచ్చని పేర్కొన్నారు.

రాజకీయ రంగ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చిన రాఘవ లారెన్స్.. జూన్ 11న కీలక ప్రకటన.

హెన్నా వాడిన తర్వాత జుట్టు పొడిగా మారకుండా ఉండేందుకు అరటిపండు-పెరుగు హెయిర్ మాస్క్, మందార ఆకులు-మెంతుల నీటితో రిన్స్ చేయడం, లేదా ఫ్లాక్స్ సీడ్ జెల్ ఉపయోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కెమికల్ ఉత్పత్తుల కంటే సహజసిద్ధమైన పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమమని వారు సూచిస్తున్నారు.

రోజూ 5 నిమిషాలు ఇలా చేస్తే కంటి సమస్యలు తగ్గుతాయి.

కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *