Donate Blood: మనలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసిఉంటారు. రక్త దానం ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి? అసలు రక్తదానం చేసేవారికి రక్తం తీసుకునే వారికి కలిగే లాభాలు ఇండియాలో రక్త దానం చేసినపుడు 350 ml రక్తం మాత్రమే తీయడం జరుగుతుంది. ఒక సారి అంత రక్త దానం చేసిన తరవాత తిరిగి రక్తం తయారు అవ్వడానికి 8 నుండి 16 వారాల సమయం అవసరం అవుతుంది.
మళ్ళీ తిరిగి 2,3 నెలల తరవాత రక్తం ఇవ్వవచ్చు. ఈ రక్తం దానం చేసిన తర్వాత శరీరం కొద్దిగా నీరసంగా అనిపిస్తుంది. 2 రోజులలో శరీరం తిరిగి మామూలుగా మారిపోతుంది. రక్త దానం చేయడం చాలా గొప్ప విషయం. మనం ఇచ్చే రక్తం వలన ఇంకొక ప్రాణం నిలబడుతుంది. రక్త దానం చేయాలంటే మన శరీరంలో కొన్ని సమస్యలు ఉండకూడదు అలాంటప్పుడు మాత్రమే మనల్ని అర్హులుగా తీసుకుంటారు.
మనకి ఉండకూడని సమస్యలు:
డయాబెటిస్ ఉండకూడదు , హైపర్ టెన్షన్ ఉండకూడదు , ఐరన్ తక్కువగా ఉండకూడదు ,జ్వరంగా ఉన్నపుడు రక్త దానం చేయకూడదు, శరీరంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్న రక్త దానానికి అర్హులు కారు ఇలాంటి సమస్యలు లేనపుడు మనం రక్త దానం చేయడానికి అంగీకరిస్తారు.
రక్త దానం చేయడం వలన మనకు కలిగే లాభాలు:
రక్త దానం చేయడం వలన గుండె సమస్యలు తక్కువగా వస్తాయి. రక్తం పునరావృతం అవుతుంది , కాన్సర్ వచ్చే సమస్య ఉండదు. రక్త దానం చేయడం వలన కొత్త రక్తo వస్తుంది దీని వలన ఉత్సాహంగా ఉంటాము. మన దగ్గర తీసుకున్నరక్తాన్ని రక్తం, రక్తం తక్కువగా ఉన్న వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. రక్త హీనత ఉన్న వారికి ఈ రక్తం ఎక్కిస్తారు. డెంగ్యూ ఉన్న వారికి కూడా రక్తం ఇస్తారు. ఇలా మనం రక్త దానం చేయడం వల్ల ఇలాంటి సమస్యల్లో ఉన్న వారికి చాలా సహాయకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు రక్త దానం చేయాలని కోరుకుంటున్నాము.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb