వీటిని నీళ్ళల్లో నానబెట్టి తినండి చాలు.

వీటిని నీళ్ళల్లో నానబెట్టి తినండి చాలు.

High protien seeds: జ్ఞాపకశక్తి పెంచుకోవాలన్న, మేధస్సు పెంచుకోవాలన్నా, శక్తి పెంచుకోవాలన్నా, బలం పెంచుకోవాలన్నా, అన్నిటికీ ఉపయోగపడేది పచ్చికొబ్బరి మరియు గుమ్మడి గింజలు. పచ్చికొబ్బరి తింటే జ్ఞాపక శక్తి మేధస్సు బాగా పెరుగుతాయి. అందుకే పచ్చి కొబ్బరిని పొడిచేసి మనం చేసుకునే ప్రతి కూరలో వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. వీలైనంత ఎక్కువగా పచ్చి కొబ్బరిని తింటే చాలా మంచిది. జింక్ లోపం ఉంటే జ్ఞాపకశక్తి లోపం ఉండే అవకాశం ఉందని సైంటిస్టులు చెప్పారు.

మన బాడీకి సగటున ఒకరోజుకు అవసర పడే జింక్ 8 మిల్లి గ్రాములు. గర్భవతి కి జింక్ లోపం ఉంటే పుట్టే శిశువుకు కూడా జ్ఞాపకశక్తి లోపం మరియు హైపర్ ఆక్టివ్ లోపం ఉండే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు. జింక్ ఎక్కువ ఉన్న పదార్థం చూసినట్లయితే గుమ్మడి గింజలు. గుమ్మడి గింజలలో జింక్ పదార్థం ఎక్కువగా లభిస్తుంది. అలాగే గుమ్మడి గింజలలో 575 గ్రాముల ప్రోటీన్స్ కూడా ఉంటాయి.

గుమ్మడి గింజలను తీసుకొని వాటి, పై పొరను తీసేసి గింజలను నానబెట్టుకొని తింటే అది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పూర్వం లో అయితే ఇంట్లో ఉండే ముసలి వాళ్లు గుమ్మడి కాయ కూర వండినప్పుడు వాటిలో ఉండే గింజలకు పైన ఉన్న ఆ తెల్ల పొరను అంతా తీసేసి నానబెట్టి గర్భవతులకు గాని చిన్నపిల్లలకు గాని అలా ఇచ్చేవారు. పైన ఉన్న పొర తీయడానికి చాలా సమయం పట్టేది, అందుకే ముసలి వారు ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ పనిని బాగా చేసేవారు.

మనకైతే అంత తీరిక ఉండదు. కానీ దీనికోసం నగరంలో గుమ్మడికాయలలో ఉన్న గింజలకు పై పొర తీసే మిషన్లు వచ్చాయి . ఇది ఒక రకంగా చాలా మంచిది. నేరుగా వారు పై పొరను సులువుగా తీసి మార్కెట్లో అందజేస్తున్నారు. దీని ఖరీదు కిలకు సుమారుగా 400 ఉంటుంది. కొబ్బరి పొడిని, గుమ్మడి గింజల పొడిని, మన ఆరోగ్యానికి అందజేస్తున్నట్లయితే మనం ముఖ్యంగా మేధస్సును, జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి వీలుంటుంది . అలాగే పుట్టబోయే శిశువు కి కూడా లెర్నింగ్ ఎబిలిటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3qlXgD5

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!