Sesame Benefits | డైలీ ఒక్క లడ్డు చాలు మీ ఎముకలు ధృడంగా మారుతాయి.

Sesame Benefits | డైలీ ఒక్క లడ్డు చాలు మీ ఎముకలు ధృడంగా మారుతాయి.

Sesame Benefits: నువ్వుల మీద ఎప్పటినుంచో ఎన్నో అపోహాలు ఉన్నాయి. సహజంగా నువ్వులు వేడి చేస్తుందని ఎక్కువగా వాడనివ్వరు. కానీ ఈ నువ్వులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇందులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. నువ్వులతో వేరే ఏ ఆహారాన్ని పోల్చలేము. అన్ని ఆహార పదార్థాల కన్నా నువ్వులలో క్యాల్షియం అధికంగా ఉంటుంది.

ఈ క్యాల్షియం అనేది ఎముకల బలానికి ఉపయోగపడుతుంది. 100 గ్రాముల నువ్వుల లడ్డులో 1450 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. ఒక రోజుకి పెద్దవారికైతే 400 మిల్లీగ్రాముల క్యాల్షియం అవసరం, పిల్లలకైతే 600, అలాగే గర్భవతికి అయితే 900 క్యాల్షియం అవసరం. అందుకే ఒక చిన్న నువ్వు లడ్డు తింటే రోజుకి సరిపడే కంటే ఎక్కువ క్యాల్షియం వస్తుంది.

ముఖ్యంగా నువ్వుల లడ్డు గర్భిణీలకు బాగా ఉపయోగపడుతుంది. నువ్వులు తింటే వేడి చేస్తుందని అనడం అస్సలు సరైనదే కాదు. అది ఒక అపోహ. నువ్వులు సరైన విధానంలో తింటే వేడి 1% కూడా చేయదు. అయితే నువ్వులను ఎలా తినాలంటే, నానబెట్టుకుని ఎక్కువసేపు నవలాలి, నువ్వులను ఇలా తిన్నట్లయితే చాలా మంచిది.

లేకపోతే వేయించుకొని పొడి లాగా చేసుకుని కూరలలో వేసుకోవాలి. లేకపోతే నానబెట్టుకొని ఒక కప్పు పాలలో వేసుకొని తినాలి. లేకపోతే కొంచెం బెల్లం వేసి లడ్డులు చేసుకొని తినాలి ఇలా చేస్తే మంచిది. నువ్వుల వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3NbgO5Z

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!