ఎండల తీవ్రత పెరగడంతో శరీరంలో చెమటలు అధికంగా పడుతుంటాయి. చెమట ద్వారా నీటితో పాటు కొన్ని ఖనిజ లవణాలు కూడా బయటకు వెళ్తాయి. దీంతో కొందరిలో నీరసం, అలసట, బీపీ తగ్గడం, కళ్లు తిరగడం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో స్పృహ కోల్పోయే పరిస్థితులు కూడా ఎదురవుతాయి.
ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు చాలామంది ఉప్పు, పంచదార కలిపిన నీటిని తాగాలని సూచిస్తుంటారు. అయితే సహజసిద్ధమైన పద్ధతుల్లోనే శరీరానికి కావాల్సిన నీరు, ఖనిజాలు, శక్తిని అందించడం మరింత ప్రయోజనకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ.
మన శరీరానికి వేసవిలో అత్యంత అవసరమైనది నీరు. చాలామంది నీరసం రావడానికి కారణం లవణాల లోపమని భావిస్తారు. కానీ ఎక్కువ సందర్భాల్లో సమస్యకు ప్రధాన కారణం డీహైడ్రేషన్, అంటే శరీరంలో నీటి కొరత. చెమట ద్వారా ఎక్కువగా బయటకు వెళ్లేది నీరే. అందుకే ముందుగా శరీరాన్ని సరైన స్థాయిలో హైడ్రేట్‌గా ఉంచుకోవడం అవసరం.
ఈ విషయంలో కొబ్బరి నీరు సహజమైన ఆరోగ్య పానీయంగా చెప్పవచ్చు. కొబ్బరి నీటిలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు సహజంగా లభిస్తాయి. శరీరంలో చెమట ద్వారా కోల్పోయిన లవణాలను తిరిగి భర్తీ చేయడంలో ఇది సహాయపడుతుంది. అందుకే వేసవిలో కొబ్బరి నీటిని సహజ ఎలక్ట్రోలైట్ డ్రింక్‌గా పరిగణిస్తారు.
రోజూ ఖాళీ కడుపుతో నెయ్యి తింటే ఏమవుతుంది?
అయితే కొబ్బరి నీరు ప్రధానంగా లవణాలను అందించినప్పటికీ, తక్షణ శక్తిని పెద్దగా ఇవ్వదు. అందుకే దీనికి సహజమైన శక్తి వనరైన చెరుకు పానకాన్ని కలిపి తీసుకోవడం మంచిదని కొందరు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
చెరుకు రసాన్ని మరిగించి చిక్కగా తయారుచేసిన ద్రావణాన్ని చెరుకు పానకం అంటారు. దీన్ని ఇంట్లో తయారు చేసి కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఒక గ్లాసు కొబ్బరి నీటిలో మూడు నుంచి నాలుగు స్పూన్ల చెరుకు పానకం కలిపి తాగితే శరీరానికి అవసరమైన ఖనిజాలు, సహజ కార్బోహైడ్రేట్లు రెండూ అందుతాయి. ఫలితంగా అలసట తగ్గి శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.
ఆర్అండ్బీ చీఫ్ ఇంజినీర్ మోహన్ నాయక్ నివాసాలపై ఏసీబీ దాడులు.. రూ.200 కోట్ల అక్రమాస్తులు?
వేసవిలో మార్కెట్లో లభించే శీతల పానీయాలు, కృత్రిమ ఎనర్జీ డ్రింక్స్‌పై ఆధారపడటం కంటే సహజమైన పానీయాలను ఎంచుకోవడం ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, బయట ఎక్కువసేపు పనిచేసే వారు ఈ తరహా సహజ పానీయాలను తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
అయితే ఏ పానీయం తాగినా మంచి నీటికి ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలి. వేసవి కాలంలో రోజుకు కనీసం నాలుగు నుంచి ఐదు లీటర్ల వరకు నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. శరీరానికి అత్యధిక రక్షణను అందించేది సాధారణ మంచినీళ్లేనని నిపుణులు చెబుతున్నారు.
ఈ 5 వస్తువులు ఫ్రిజ్‌లో పెడితే… కడుపు నాశనం.
అందువల్ల వేసవిలో శరీరాన్ని చల్లగా, చురుకుగా ఉంచుకోవాలంటే తగినంత నీరు తాగడం, కొబ్బరి నీరు తీసుకోవడం, అవసరమైతే చెరుకు పానకంతో కలిపి సేవించడం వంటి సహజ పద్ధతులను అనుసరించడం ఉత్తమం.
బొకేలు, శాలువాలకు బదులు విద్యార్థులకు సాయం చేయండి.. సీఎం విజయ్ కొత్త సందేశం

మలబద్ధకం ఎందుకు వస్తుంది? కారణాలు, జాగ్రత్తలు మరియు సహజ పరిష్కారాలు.
