Nithya Menon: నిత్యామీనన్ ఈ ముద్దు గుమ్మ గురించి కొత్త పరిచయం అవసరం లేదు అనుకుంటా అయితే టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటించిన అలా మొదలైంది మూవీ తో తెలుగు చిత్ర పరిశ్రమ కు పరిచయం అయ్యింది. . ఇక ఆ సినిమా తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంది. నిత్యమీనన్ నటనతో పాటు తనలోని మరో టాలెంట్ సింగింగ్ కూడా. కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడింది ఈ చిన్నది. తెలుగు, మళయాళంతో పాటు తమిళ్‌లోనూ సినిమాలు చేస్తోంది నిత్యా.
Also read: Remedies for Toothache | పంటి నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కా.
నిత్యామీనన్ రీసెంట్‌గా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ మూవీ లో చేసింది. ఇక ఆ మూవీ మంచి హిట్ సాధించింది. ఈ ఇందులో నిత్యామీనన్, పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో నటించి ఆకట్టుకుంది. దీనితో నిత్యామీనన్ పలు ప్రాజెక్టులతో బీజీ గా ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ సింగింగ్ షోలో నిత్యా జడ్జీ గా వ్యవహరిస్తోంది.
Also read: Gopika Govind Sucess story | ఈ యువతి సక్సెస్ స్టోరీ తెలిస్తే మాత్రం కచ్చితంగా దండం పెట్టాల్సిందే!
ప్రస్తుతం నిత్యామీనన్ క్యాస్టింగ్ కౌచ్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికే చిత్ర పరిశ్రమలో చాలా మంది నటులు క్యాస్టింగ్ కోచ్ పై స్పందించిన విషయం తెలిసిందే. ఇలా చాలా మంది హీరోయిన్లు మీడియా ముందు, పలు ఇంటర్వ్యూల్లో తమకు ఎదురైనా చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. అయితే ఈ ముద్దు గుమ్మ ని తమిళ పరిశ్రమలో ఒక హీరో ఇబ్బంది పెట్టాడట.
Also read: B Complex Laddu | నరాల బలహీనత ను తగ్గించి శరీరంలో శక్తిని పెంచే లడ్డు ఎలా తయారు చేస్కోవాలో చూడండి.
షూటింగ్ అసభ్యంగా తాకుతూ సరిగ్గా ప్రవర్తించలేదు. తన ప్రవర్తన కారణంగా షూటింగ్ కూడా సరిగ్గా చేయలేకపోయాను. ఇలాంటి వాతావరణంలో మహిళలు అస్సలు పని చేయలేరు. అందుకే ఈ రోజుల్లో మహిళలు బయటికి వెళ్లి పని చేయడానికి భయపడుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు నిత్యా మీనన్. నిత్యామీనన్(Nithyamenon) నటించిన ఆ తమిళ చిత్రాల్లో ఏ హీరో అయి ఉంటాడని సందేహంలో పడ్డారు నెటిజన్లు. కానీ నిత్యామీనన్ మాత్రం తన పేరు చెప్పలేదు.
Also read: Gas problem | పొట్టలో ఉబ్బరం పోవాలి అంటే ఎలా చేయండి.
