వ్యాక్సిన్ కి వాక్సిన్ కి మధ్య ఎంత టైమ్ ఉండాలి?కచ్చితంగా చూడండి.

వ్యాక్సిన్‌ మొదటి డోసు రెండవ డోసుకి మధ్య ఎక్కువ గ్యాప్‌ ఉంటే అవి మరింత సమర్థంగా పనిచేస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది. మొదటి డోసు వేసుకొన్నవారికి రెండో డోసును ఆలస్యంగా ఇవ్వడం వల్ల యాంటీబాడీలు 300శాతం వరకు అధికంగా ఉత్పత్తయ్యే అవకాశం ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. తొలి డోసు తర్వాత రోగ నిరోధక వ్యవస్థ స్పందించడానికి ఎక్కువ సమయం ఇచ్చినట్లయితే వ్యాక్సిన్‌ తీసుకొన్నవారికి మరింత రక్షణ లభిస్తుందని పేర్కొంటున్నారు. అన్ని వ్యాక్సిన్‌ల విషయంలోనూ ఇది మంచి ఫలితాలను ఇచ్చినట్టు కొన్ని పరిశోధనల్లో తేలింది.

Alsoread: బాత్ రూంలో స్నానం ఎంత సేపు చేస్తారు ? 16 గంటల తరువాత ఏం జరిగింది.

ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్లు తొలి డోసు తీసుకొన్నవారికి రెండో డోసును మూడు వారాల తర్వాత కాకుండా మూన్నెళ్ల తర్వాత ఇస్తే యాంటీబాడీల ఉత్పత్తిలో 3.5రెట్లు వృద్ధి కనిపించిందని పరిశోధకులు తెలిపారు.9నుంచి 15 వారా లు గ్యాప్‌ ఇవ్వడం ద్వారా ఇన్ఫెక్షన్లను, మరణాలను తగ్గించవచ్చని మరికొన్ని పరిశోధనల్లో తేలింది. ఆ ర్నెల్లు గ్యాప్‌ ఉంటే ఇంకా మంచిదని కెనడాలో జరిగిన ఒక అధ్యయనం పేర్కొంది.

Alsoread: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా ? అయితే మారిజువానా ఉచితం గా ఇస్తాం,మత్తులో తేలిపోండి.

అనేక కారణాల వల్ల వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటున్న దేశాలకు ఈ అధ్యయనాలు సానుకూల పరిణామం కానున్నాయి. అనేక దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన తొలినాళ్లలో మొదటి, రెండో డోసుల మధ్య ఎక్కువ విరామం ఇస్తున్నారని విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ఎంత ఎక్కువ గ్యాప్‌ ఉంటే అంత మంచిదని పరిశోధనలు సూచిస్తున్నాయి. దీంతో ప్రభుత్వాలు కూడా వ్యాక్సిన్‌ డోసుల మధ్య గ్యాప్‌ను పెంచుతున్నాయి.

Alsoread: గుడ్ న్యూస్..! ప్రతి నెల ఈ‌ఎం‌ఐ కట్టలేక ఇబ్బంది పడ్తున్నారా అయితే మీ కోసమే ఈ వార్త.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *