రైతులకు గొప్ప శుభవార్త, కేంద్ర ప్రభుత్వం వీటిపై భారీ రాయితీ.

రైతులకు గొప్ప శుభవార్త, కేంద్ర ప్రభుత్వం వీటిపై భారీ రాయితీ.

అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు పెరుగుతుండటంతో రాయితీని 140 శాతం పెంచుతున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) బుధవారం ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బుధవారం రైతన్నలకు శుభవార్త చెప్పింది. దీంతో ప్రభుత్వంపై అదనంగా రూ.14,775 కోట్లు భారం పడుతుందని తెలిపింది. మొత్తం మీద ఎరువులపై రాయితీ కోసం రూ.95,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించింది.
పీఎంఓ విడుదల చేసిన ప్రకటనలో, అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నప్పటికీ, రైతులకు ఎరువులు పాత ధరలకే అందాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. Central government anounced high discount on fertilizers-fbhealthy.com

Alsoread: బ్లాక్ పంగస్ అంటే ఏమిటి? బ్లాక్ పంగస్ అసలు ఎలా వస్తుంది?

రైతుల సంక్షేమంపై ప్రధాన దృష్టితోనే ప్రభుత్వ కార్యకలాపాలు జరుగుతాయి అని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ఒక ఎరువుల బస్తాకు రూ.500 చొప్పున రాయితీ ఇస్తోందని, దీనిని రూ.1,200కు పెంచాలని నిర్ణయించిందని తెలిపింది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినందువల్ల ఒక బస్తా డీఏపీ లేదా డై అమ్మోనియం ఫాస్పేట్ ధర రూ.2,400 ఉంటుందని తెలిపింది. అయితే రైతులు గత ఏడాది పొందినట్లుగానే రూ.1,200కే ఈ ఎరువును పొందవచ్చునని పేర్కొంది. Central government anounced high discount on fertilizers-fbhealthy.com

Alsoread: ప్రయోగాలు విజయవంతం….!అన్ని కరోనా వైరస్‌లకూ చెక్‌పెట్టే కొత్త టీకా.

రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రెండో ప్రధాన నిర్ణయం ఇది అని పీఎంఓ తెలిపింది. అక్షయ తృతీయనాడు పీఎం-కిసాన్ పథకం క్రింద లబ్ధిదారులైన రైతుల ఖాతాలకు రూ.20,667 కోట్లు నేరుగా బదిలీ చేసినట్లు వివరించింది.

Alsoread: బయటకు వస్తే వాహనాలు సీజ్‌….నేటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *