సుఖమైన నిద్రకు ఈ చిన్న చిట్కా పాటించండి.

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ తెలియని ఒత్తిడికి గురి అవుతున్నారు. ప్రశాంతమైన నిద్ర లేక పోవడంతో శరీరం ఆరోగ్యంలో ఎన్నో రకాల మార్పులు వస్తాయి, ఆ మార్పులు రోజువారి జీవితంపై రకరకాల ఎఫ్ఫెక్ట్స్ చూపిస్తుంది.

చాలా మంది నిద్ర సమస్యను అధిగమించడానికి డాక్టర్ ల వద్దకు వెళ్ళి నిద్ర మాత్రలను వాడుతుంటారు. ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరం అని మరచిపోవద్దు. ఇక అసలు విషయానికి వస్తే ఎంత ఒత్తిడి జీవితంలో అయినా సుఖమైన నిద్ర పట్టాలి అంటే ఏమి చేయాలో తెలుసుకుందాము.

కొన్ని రకాల ఎసెన్షియల్ ఆయిల్ లలో సహజమైన నిద్రకు ఉపకరించే గుణం ఉంటుంది. ఆ ఆయిల్ లో కొన్ని రకాల వైరస్ లను బాలహీనపరిచే శక్తి ఉంటుంది. అలాంటి నూనెలలో లావెండర్ ఆయిల్(లవంగ నూనె) ఒకటి. యూకలిప్టుస్ నూనెలు కూడా మంచి నిద్రకు చాలా ఉపయోగపడుతుంది.

మంచి నిద్రకు ఈ నూనెను ఎలా వాడాలి అంటే ముఖ్యమైన నూనె ను ఒక చుక్క తీసుకుంటే దానిలో ఒక టేబల్ స్పూన్ సాధారణ నూనె తీసుకొని ఆయిల్ డెఫ్యూజర్ ను ఉపయోగించాలి. ఇలా చేయడం వలన వాటి నుండి మంచి వాసనలు వస్తాయి. ఈ వాసనలు మంచి నిద్ర ఇవ్వడం తో పాటు, ఒత్తిడిని దూరం చేసి మానసిక ఉల్లాసాని పెంచుతాయి.