సుమ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ వైరల్ కామెంట్స్.

మెగా హీరో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రానికి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నెల 25 న ప్రపంచ వ్యాప్తం గా RRR సినిమా విడుదల కాబోతుంది అనే విషయం అందరికీ తెలిసినదే.

ఈ సినిమా ప్రమోషన్ కోసం ఈ చిత్ర యూనిట్ వరుస ఇంటర్వ్యూ లు చేసి రకరకాలు గా ప్రచారం చేస్తూ వస్తుంది. తాజా గా సంగీత దర్శకుడు M M కీరవాణి ఇంటర్వ్యూ చేస్తూ రాంచరణ్, ఎన్టీఆర్ లను కొన్ని ప్రశ్నలను అడిగారు.

అందులో ఒక ప్రశ్న ఏమి అడిగారు అంటే యాంకర్ సుమ కు మీ సినిమాలో ఏ పాత్ర ఇస్తారని అడగగా సుమకు చాదస్తం ఎక్కువ కాబట్టి సుమ కు అమ్మమ్మ లేదా నాయనమ్మ పాత్ర ఇస్తే బాగుంటుంది. ఎక్కువ గా మాట్లాడటుతుంది కాబట్టి గయ్యాలి అత్త పాత్ర గుర్తుకువస్తుంది అని చెప్పాడు.

మెగా హీరో చెర్రీ కూడా ఈ ప్రశ్నకు బదులిస్తూ సుమ గారు పంచాయతీలు బాగా పరిష్కరిస్తారు కాబట్టి మధ్యవర్తి పాత్ర ఇవ్వాలని ఇవ్వాలని ఇద్దరు హీరో లు సుమపై వారి అభిమానాన్ని ఈ విధంగా తెలియజేశారు.