ఈ ఆరునెలలు వాట్స్ యాప్, ఫేస్బుక్, సినిమా లు బంద్.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 90 వేల పైగా ఉద్యోగ నియామకాలు ప్రకటించిన క్రమంలో యువతకు మంత్రి కేటీఆర్‌ పిలుపు నిచ్చారు. యువత తమ తల్లి దండ్రులను సంతోష పెట్టే వారిలా ఉండాలి.

వారి తియ్యని భవిష్యత్తు ప్రణాళికలు వేసుకొని ముందుకు సాగాలని మంత్రి కేటీఆర్ కోరారు. పీర్జాదిగూడ బుద్ధానగర్‌ సాయిబాబా టెంపుల్‌ కమ్యూనిటీ హాల్‌లో ఉచిత కోచింగ్ సెంటర్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 90 వేల పైగా పోస్టు లను ప్రకటించింది.

దానికి అనుగుణంగా విద్యార్థులు ఈ ఆరు నెలలు కష్టపడి చదివి తల్లి దండ్రుల కళలను సహకారం చేయాలని అన్నారు. ఈ ఆరు నెలలు విద్యార్థులు ఫోన్ లో సినిమా లు, ఫేస్ బుక్, వాట్స్ యాప్, క్రికెట్, ఇన్ స్టాగ్రామ్ లను వదిలి చదువు పై దృష్టి పెట్టండి అని సూచించారు.