మీ కీళ్ల నోప్పులు తగ్గే అద్భుత వంటింటి చిట్కా.

కీళ్ల కాళ్ళ నోప్పులు చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో కనిపిస్తున్న సమస్య ఇది. ఈ సమస్య వృద్దులే కాదు, యుక్త వయసులో ఉన్న వారు కూడా బాధ పడుతున్నారు. కీళ్ల నొప్పులకు కారణం కీలు బాగంలో దెబ్బతగలడం,కొంత మందికి కీళ్ల వాతం ఉండడం, పోషక ఆహారలోపం, ఆరహాపు అలవాటు, రోజువారి పని ఒత్తిడి ఇలా చెప్తే ఇంకా ఎన్నో ఉంటాయి. ఏది ఏమైనా ఏ కారణం అయినా ఈ కీళ్ల నోప్పులు తగ్గాలి అంటే ఈ చిన్న రెమెడీ మీరు వాడాల్సిందే.

ఈ రెమెడీ కి ఏమి కావాలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం:

  1. మెంతులు
  2. దాల్చిన చెక్క పొడి.

తయారు విధానం: ముందుగా మిక్సీ తీసుకొని దానిలో మూడు టేబల్ స్పూన్ల మెంతులు వేసి పొడిగా చేసుకోవాలి. అదే విధంగా దాల్చిన చెక్క కూడా వేసుకొని పొడిగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక మంచి గాజు సీసాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజు ఉదయం పూట గోరువెచ్చని నీటిలో అర టీ స్పూన్ వేసకొని తాగడం వలన మీ కీళ్ల నోప్పులు మాయం అవుతాయి. ఈ రెమెడీ చేస్తూ కొన్ని రకాల స్పైసీ ఫూడ్స్ కి (మైదా, బేకరీ ఫుడ్స్‌, వేపుళ్ళు, పంచదార, టీ )వంటి వాటికి ధూరంగా ఉండాలి. సీజన్ లో దొరికే ప్రతి పండ్లను మీ రోజువారి ఆహారం లో చేర్చుకోవాలి.