Lavanya Tripathi: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మెగా వారసుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. గత కొంతకాలంగా టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం నడిపిస్తున్న తెలిసిందే .. ఎట్టకేలకు వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. అయితే ఈ ఇద్దరి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది.
Also read: Sweat Smell | ఇది వాడి చూడండి మీ చెమట సమస్య ను దూరం చేస్కోండి.
నెటిజన్ల కన్ను ఎప్పుడూ సెలబ్రిటీల బట్టలు, వాళ్లు వాడే వస్తువులపై ఉంటూనే ఉంటుంది. ఇక అందులోనూ సెలబ్రిటీలకు ఏదైనా అకేషన్ ఉంటే చాలు.. సోషల్ మీడియా లో మరుసటి రోజు వారి గురించి.. ఇక వారు వాడిన వస్తువుల గురించి ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటాయి. అయితే ప్రస్తుతం వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థంలో.. లావణ్య కట్టుకున్న పట్టు చీర ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తోంది.
Also read: Fat Burning Tips | మీ శరీరంలో ఫ్యాట్ కరిగించుకునే అద్భుతమైన టిప్స్.
అయితే ఈ చీరను లావణ్య త్రిపాఠి కి అందించిన ఓ ఫ్యాషన్ డిజైనర్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. లైట్ గ్రీన్ కలర్ లో ఉన్న ఈ పట్టు చీర మెరిసిపోతుండగా లావణ్య త్రిపాఠి ఇందులో మరింత అందంగా కనిపించింది. నెటిజనులు మాత్రం ఇతర హీరోయిన్స్ పెళ్లి చీరల ధరతో పోలిస్తే ఇది తక్కువే అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)నిశ్చితార్థానికి 75 వేల రూపాయల చీర కట్టింది అంటే పెళ్ళికి కచ్చితంగా లక్ష రూపాయలు దాటుతుంది అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. దీని పై మీ అభిప్రాయం తెలపండి.
Also read: More Immunity power | శరీరంలో కావలసినంత ఇమ్యూనీటి పెరుగుతుంది.
