పుదీనా టీ తాగడం వలన కలిగే ఉపయోగాలు తెలుసా మీకు?

PEPPERMENT LEAVES TEA: అందరికీ అందుబాటులో ఉండే రోగనిరోధక శక్తి పెంచే టీ పుదీనా టీ. హుషారు గా లేని వారిని సైతం ఒక్క కప్పు టీ తో వారిలో సత్తువ తెప్పించే అద్భుతమైన టీ పుదీనా టీ. వేసవి ప్రతి ఒక్కరికీ ఈ ఎండనుండి తప్పించుకోవడానికి కచ్చితంగా రోగనిరోధక శక్తి కావాలి.

పుదీనా టీ కావాల్సిన పదార్థాలు:

  1. పుదీనా
  2. నిమ్మరసం
  3. తేనె

పుదీనా టీ తయారీ విధానం:

ముందుగా టీ పెట్టుకోవడానికి సరిపడ గిన్నె తీసుకోవాలి, ఒక గ్లాస్ నీరు తీసుకోవాలి. స్టౌ ఆన్ చేసి దానిపై ఒక గిన్నె పెట్టి దానిలో ముందు గా తీసుకున్న నీరు పోసుకోవాలి. నీళ్ళు కొంచెం వేడి అవ్వగానే అందులో ఒక పది ఆకులు పుదీనా వేసి ఆ నీటిని కొంత సమయం మరగనివ్వాలి.

పుదీనా ఆకులు నీటిలో మగ్గిన తరువాత ఆ నీటిని వాడకట్టుకోవాలి. దానిలో రుచికి సరిపడా నిమ్మరసం, తేనె కలుపుకొని తాగవచ్చు. డయాబెటిస్ సమస్య ఉన్న వారు తేనె వేసుకోకుండా తాగితే చాలా మంచిది. ఎండలో బయట తిరిగి వచ్చిన వారికి ఈ టీ చాలా ఉపశమనం కలిస్తుంది.. ఈ టీ ని వేడిగా కాకుండా ఐస్ ముక్కలు వేసుకొని చల్లగా కూడా తగవచ్చు.