శరీర ఆరోగ్యానికి బహు ప్రయోజనకారి తోటకూర గురించి మీకు తెలుసా? అయితే తెలుసుకోండి.

ఆకుకూరల్లో శరీరానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. తోటకూర ను రోజువారి ఆహారంలో చేర్చుకుంటే చాలా మంచిది. తోట కూరల్లో రక రకాల వెరైటీ లు ఉన్నప్పటికీ అన్నీ తోటకూరళ్ళలోను ఒకే రకమైన పోషకవిలువలు ఉంటాయి.

ఆకు కూరలు పచ్చగా కనిపించడంతో వాటిలో పసరు ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఆకుకూర ను సంపూర్ణ ఆహారంగా చెప్పవచ్చు. తోటకూర లో శరీరానికి కావాల్సిన విటమిన్ ఎ,కె,సి,బి6,ఫోలేట్, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, మరియు రైబోఫ్లేవిన్ అనేవి తోటకూర లో పుష్కలంగా లబిస్తాయి.

తోటకూర లో ఐరన్ శాతం ఎక్కువగా ఉండడం వలన రక్త హీనతతో బాధపడే వారు తోటకూర ను ఆహరంగా తీసుకోవచ్చు. తోటకూర ఆకుల్లో మాంగనీస్, ఐరన్, కాపర్, కాల్షియం, పొటాషియం ఇంకా అలాగే ఫాస్ఫరస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. తోటకూర లో ఫైబర్ ఉండడం వలన జీర్ణక్రియ సరిగా జరిగేలా చేస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వారు తోటకూర ను రోజు వారి ఆహరంలో చేర్చుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుంది.