ఈ గింజలు మన శరీరంకి ఎంత ఉపయోగమో తెలుసా? మిస్సవకుండా చూడండి.

ఆవాలు తెలియని వారు ఎవరు ఉండరు. ఇవి చూడటానికి నల్లగా గుండ్రంగా చాలా చిన్న గా ఉంటాయి, ఆవాలు చాలా రంగుల్లో కూడా దొరుకుతాయి. ఆలవాలా పిండిలో గ్లూకోసినోలేట్స్ మైరోసినేట్టి సమ్మేళనాలు ఉండటం వలన శరీరంలో కాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తాయి.

చాలా మందిలో ఎక్కువ కాలంగా వచ్చే మైగ్రేన్ తలనొప్పి తో బాధపడే వారు ఈ ఆవాలను రోజు వారి అహరంలో చేర్చుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. జీర్ణ సమస్యతో భాదపడే వారు, తీవ్రమైన ఒత్తిడితో బాధపడే వారు ఈ ఆవాలను ఆహారంలో తీసుకోవడం ద్వారా ఆ సమస్య నుండి బయట పడటానికి చాలా బాగా ఉపయోగపడతాయి.

వీటిలోని ఫైబర్ ఉండటం వలన పేగుల కదలీకను పెంచి జీర్ణ శక్తి మెరుగుపడేలా చేస్తూ, మలబద్దకం సమస్యను తొలగిస్తుంది. వీటిని ఆహారంలోనే కాకుండా ఆయిల్ గా కూడా మారుస్తారు. ఈ ఆయిల్ వాడటం వలన రక్తంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించి హృదయ సంబంధ వ్యాధులు రాకుండా చేస్తుంది.

ఆవాలలో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన నోటి చిగుళ్ళ, ఎముకలు, జుట్టు, దంతాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. దీనిలోని సెలీనియం ఎముకలు బలంగా మారెల చేస్తాయి. ఆవాలను ఊరగాయాల్లోనూ, సలాడు లోనూ, రకరకాల పచ్చడి లలో విరివిగా వాడతారు. ఇవి చర్మ కణాలలోని మలినాలను తొలగించి శరీరాన్ని కాంతివంతంగా కపడేలా చేస్తాయి.